Tuesday, June 11, 2019

వేదాంతే పరమం గుహ్యం , పురా కల్పే ప్రచోదితం,
నాప్రశాంతాయ దాతవ్యం, నా పుత్రాయా శిష్యాయ వా పునః ---శ్వేతాశ్వ 6-22

అర్ధం:- ఉపనిషత్తులలో పరమపురుషార్ధముగా బోధించబడి యున్నదిన్నీ పరమ రహస్యమైనదిన్నీ ఐన బ్రహ్మ విద్యను, కల్పాది యందు పరంబ్రహ్మ ఉపదేశించెను. అట్టి ఈ విద్యను, ప్రశాంత చిత్తుడు కానట్టి శిష్యునికి కానీ, పుతృనికి గానీ ఉపదేశించ రాదు.
హతం జ్ఞానం క్రియాహీనం, హతా స్త్వజ్ఞానత: క్రియా:
అపశ్య  న్న౦ధకో దగ్ధ:,  పశ్యన్నపి    పంగుక: 
తా: ఆచరణ లేని జ్ఞానమున్ను , జ్ఞానములేని క్రియలున్ను కుడా నిరుపయోగములై  నశించును. నడువలేని కుంటివాడును, చూడలేని గుడ్డివాడున్ను ఇల్లు తగులబడినచొ  చూచుచునే కుంటివాడును, నడువగలిగియు గుడ్డివాడును నశింతురు గదా.


క్షమా వశీకృతి లోకే, క్షమయా కిం న సిధ్యతి,

శాంతిఖడ్గ: కరే యస్య, కిం కరిష్యతి దుర్జనః –అర్యధర్మ
తా:  క్షమా గుణమువలన లోకమంతా వశమౌతుంది. దీనివలన సాధ్యం కాని దేదిన్ని లోకంలో లేదు. ఎవని చేతిలో శాంతి అనే ఖడ్గం ఉందొ వానిని దుర్జనుడు ఏమిచేయ గలడు.