వేదాంతే పరమం గుహ్యం , పురా కల్పే ప్రచోదితం,
నాఽప్రశాంతాయ దాతవ్యం, నా పుత్రాయా శిష్యాయ వా పునః ---శ్వేతాశ్వ 6-22
అర్ధం:- ఉపనిషత్తులలో పరమపురుషార్ధముగా బోధించబడి
యున్నదిన్నీ పరమ రహస్యమైనదిన్నీ ఐన బ్రహ్మ విద్యను, కల్పాది యందు పరంబ్రహ్మ
ఉపదేశించెను. అట్టి ఈ విద్యను, ప్రశాంత చిత్తుడు కానట్టి శిష్యునికి కానీ,
పుతృనికి గానీ ఉపదేశించ రాదు.